ఝరిలో విషాద ఘటన.. బావిలో పడి వ్యక్తి మృతి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కుమారుడి మరణంతో మానసిక వేదన.. అదే బావిలో తండ్రి మృత్యువాత
మన భారత్, తలమడుగు:నవంబర్ 5, తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం బావిలో పడి తన చిన్న కుమారుడిని కోల్పోయిన తండ్రి, అదే బావిలో పడి మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే.. ఝరి గ్రామానికి చెందిన మోహిత్ వినోద్ గత మూడేళ్ల క్రితం తన చిన్న కుమారుడిని బావిలో పడి కోల్పోయాడు. అప్పటి నుంచి కుమారుడి మరణాన్ని తలచుకుంటూ తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మద్యానికి అలవాటు పడ్డాడని, గత నాలుగు రోజులుగా అధికంగా మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులతో తన కుమారుడు మరణించిన అదే బావిలో పడి తాను కూడా చనిపోతానని తరచూ చెబుతుండేవాడని పేర్కొన్నారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మోహిత్ వినోద్, తన కుమారుడు గతంలో మృతి చెందిన అదే బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుడి భార్య మోహిత్ శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
