manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 1:25 am Editor : user5442714

రూ.50 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేసిన ఎస్సై..

క్లోజ్ అయిన కేసులో వేధింపులు.. రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రూ.50 వేలు ఇవ్వాలని బాధితుడిపై ఒత్తిడి
డబ్బులు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తానని బెదిరింపు
మీడియాకు వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ మధు

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 4, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో పోలీసు అధికారి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమేశ్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో బాధితుడిని వేధిస్తూ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్ హత్నూర్ పరిధిలో గతంలో నమోదై ముగిసిన ఓ కేసును తిరిగి విచారణ పేరుతో ప్రస్తావిస్తూ ఎస్సై రమేశ్ బాధితుడిని ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.50 వేలు ఇవ్వాలని, లేదంటే కేసులో ఇరికిస్తానని బాధితుడిని ఎస్సై బెదిరించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

ఎస్సై వేధింపులు, లంచం డిమాండ్‌తో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బుధవారం బాధితుడి నుంచి రూ.40 వేల నగదు తీసుకుంటుండగా ఎస్సై రమేశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు మీడియాకు వివరించారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారులే లంచాల కోసం వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లంచం డిమాండ్ చేసినా, ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా డబ్బులు అడిగినా ప్రజలు ఏసీబీని సంప్రదించాలని సూచిస్తున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});