మిస్ తెలంగాణ టైటిల్ సాధించిన ఆదిలాబాద్ బాలిక ఇతిక్ష
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాష్ట్రస్థాయి ఫ్యాషన్ షోలో సబ్ జూనియర్ విభాగంలో ప్రతిభ.. నివాసానికి వెళ్లి అభినందించిన సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి…
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4,
రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఇతిక్ష ప్రతిభ కనబరిచి మిస్ తెలంగాణ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తెలంగాణ స్పార్క్ పేరిట నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫ్యాషన్ షోలో సబ్ జూనియర్ విభాగంలో పాల్గొన్న ఇతిక్ష తన ప్రతిభతో ఈ ఘనత సాధించింది.
ఈ సందర్భంగా మంగళవారం ఇతిక్ష నివాసానికి వెళ్లిన పలువురు సామాజిక కార్యకర్తలు ఆమెను, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి వేదికపై ప్రతిభను చాటుకుని టైటిల్ సాధించడం ఆదిలాబాద్‌కు గర్వకారణమని వారు పేర్కొన్నారు.
విద్యతో పాటు కళలు, సాంస్కృతిక రంగాల్లోనూ బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇతిక్ష భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ముడుపు మౌనిష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, నారాయణ రెడ్డి, భూశెట్టి శేషయ్య, సాయికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
