మాదాపూర్ లో భక్తిశ్రద్ధలతో దండారి ఉత్సవ పూజలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దండారి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు – నాయకులకు గ్రామస్తుల ఘన సన్మానం
మన భారత్, నేరడిగొండ:నవంబర్ 4,
నేరడిగొండ మండలంలోని మాదాపూర్ గ్రామంలో దండారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బాపూరావు ఆదేశాల మేరకు నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు, పార్టీ సీనియర్ నాయకులు ఆత్రం రఘునాథ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు దండారి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన నాయకులను గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాథోడ్ బాపూరావు ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు దండారి ఉత్సవాలు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభ వేడుకలు గ్రామంలో భక్తి, సంప్రదాయబద్ధమైన వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
