manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 4:13 pm Editor : user5442714

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బజార్‌హత్నూర్ ఎస్ఐ రమేశ్

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బజార్‌హత్నూర్ ఎస్ఐ రమేశ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేసు విషయంలో రూ.50 వేలు డిమాండ్.. రూ.40 వేలకు ఒప్పందం లంచం సొమ్ము స్వీకరిస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

మన భారత్, బజార్‌హత్నూర్:నవంబర్ 4,

ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. బజార్‌హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.

వివరాల ప్రకారం.. ఓ కేసు విషయంలో సంబంధిత వ్యక్తి నుంచి ఎస్ఐ రమేశ్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చివరకు రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు వ్యక్తి నుంచి రూ.40 వేల నగదును లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి ఎస్ఐను పట్టుకున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ విధులు నిర్వహించే అధికారులు ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి లంచాల కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో పోలీసు శాఖలో కలకలం నెలకొంది. ఎస్ఐ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});