దాబా (కే)లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎంపీ నగేష్‌కు ఆహ్వానం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేసిన ఎంపీ గోడం నగేష్
మన భారత్, ఇచ్చోడ:నవంబర్ 4,
ఇచ్చోడ మండలం దాబా (కే) గ్రామంలో ఈ నెల 22న నిర్వహించనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్‌ను గ్రామస్తులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఎంపీ గోడం నగేష్‌ను దాబా (కే) గ్రామానికి చెందిన దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ నెల 22న గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను ఎంపీకి తెలియజేసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఎంపీ గోడం నగేష్ తన చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన విషయాలను నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో దాబా (కే) గ్రామ దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
