అందర్‌బంద్‌లో ఘనంగా గిరిపుత్రుల దండారి ఉత్సవాలు ప్రారంభం..
గుస్సాడి నృత్యాలతో అలరించిన ఆదివాసీ కళాకారులు.. వీక్షించిన సర్పంచ్ సీతారాం మన భారత్, భీంపూర్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్‌బంద్ గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రులు సంప్రదాయబద్ధంగా దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పండుగ వాతావరణంలో గ్రామస్థులు, ఆదివాసీ యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో సందడి నెలకొంది. దండారి ఉత్సవాలు ఆదివాసీ గిరిజనుల జీవన విధానానికి, సంస్కృతికి, సంప్రదాయ కళలకు అద్దం...