కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తాంసి: నవంబర్ 3, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బ్యాంకింగ్, బీమా, పెన్షన్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాంసి మండలం గొట్కూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తలమడుగు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ వెంకట సాయి కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ బ్యాంకింగ్, బీమా, పెన్షన్ పథకాల వివరాలను వివరించారు.
ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంతో పాటు అర్హతకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల్లో చేరాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, బీమా సదుపాయాలు, పెన్షన్ పథకాల ద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పథకాలపై అవగాహన పెంచుకొని అందుబాటులో ఉన్న ప్రయోజనాలను పొందాలని కోరారు.
రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టాలు, అప్పుల సమస్యల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక సహాయ మార్గాలపై అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాడే స్వామి, గ్రామ సర్పంచ్ మతీన్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
