రైతు గర్జన ముగిసినా.. రైతుల సమస్యలపై జోగు రామన్న దృష్టి!
ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై వ్యవసాయ క్షేత్రంలో పరిశీలన మన భారత్, జైనథ్: నవంబర్ 3, ఆదిలాబాద్ జిల్లా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమం ముగిసినప్పటికీ, వ్యవసాయంపై ఆయన దృష్టి కొనసాగుతోంది. రైతుల సమస్యలు, పంటల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మంగళవారం జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఉన్న తన సొంత వ్యవసాయ పొలాన్ని ఆయన సందర్శించారు. ఈ...