manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 3:11 pm Editor : user5442714

నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్

నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట – ఎంపీ గోడం నగేష్

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 3, నిర్మల్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్రలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండేందుకు, ఓటర్ల జాబితాలో అక్రమాలను నివారించేందుకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో ఉన్న అనర్హమైన, నకిలీ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడటమే ఈ ప్రక్రియ ఉద్దేశమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిందని ఆరోపించిన ఆయన, అదే విధానాన్ని తిరిగి కొనసాగించాలనే ప్రయత్నాలను ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ప్రాధాన్యత ఉందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

ఈ మహా పాదయాత్ర కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పటేల్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారరూ.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});