manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 3:06 pm Editor : user5442714

అమెరికాలో తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న రేలా రవి..

అమెరికాలో తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న రేలా రవి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

దుబార్‌పేట్‌లో రేలా రవికి ఘన స్వాగతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో చాటిచెప్పిన ప్రముఖ జానపద గాయకుడు రేలా రవి అమెరికాలో పర్యటించి స్వగ్రామమైన దుబార్‌పేట్‌కు చేరుకున్నారు. అమెరికాలో నిర్వహించిన తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తన పాటలతో తెలంగాణ జానపద కళా వైభవాన్ని అక్కడి తెలుగు ప్రజలకు పరిచయం చేసిన అనంతరం స్వగ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ పండుగలు, జానపద కళలు, గ్రామీణ సంస్కృతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో రేలా రవి చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల మధ్య బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.

ఈ స్వాగత కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కుంరం కోటేశ్వర్, గ్రామ సర్పంచ్ మాడవి భీంరావు, గ్రామ పటేల్ సిదం జోతీరాం, కత్లే జంగు, సలాం, పైకు పటేల్ గణపతి, చాహకటి రమేష్, పవన్, కత్లే విట్టల్ తదితరులు పాల్గొని రేలా రవికి శుభాకాంక్షలు తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});