manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 2:42 pm Editor : user5442714

అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్ విడుదల..

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్ విడుదల




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జైనథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 538 మంది అభ్యర్థులు

నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు మండలాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన

మన భారత్, జైనథ్: నవంబర్ 3, జైనథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 278 మంది, అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 260 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 538 మంది అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీల్లో సంబంధిత మండలాల్లో హాజరుకావాలని సూచించారు.

నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండలాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.

మండలాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన తేదీలు:

– నవంబర్ 3: భీంపూర్, తాంసి, జైనథ్ మండలాలు.
– నవంబర్ 4: సాత్నాల, బోథ్, తలమడుగు మండలాలు.
– నవంబర్ 5: సాత్నాల, బేల, తలమడుగు మండలాలు.
– నవంబర్ 6: బేల, తలమడుగు మండలాలు.

తీసుకురావాల్సిన ఒరిజినల్ ధ్రువపత్రాలు:

1. పదో తరగతి మార్కుల మెమో.
2. ఇంటర్మీడియట్ మార్కుల మెమో.
3. ప్రస్తుత నివాస ధ్రువీకరణ పత్రం.
4. కుల ధ్రువీకరణ పత్రం.
5. భర్త మరణించి ఉంటే డెత్ సర్టిఫికెట్.
6. సదరం సర్టిఫికెట్ (వర్తించే వారికి).
7. డిపెండెంట్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం).
8. ఒంటరి మహిళ ధ్రువీకరణ పత్రం (వర్తించే వారికి).

అభ్యర్థులు పైన పేర్కొన్న ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. నిర్ణీత తేదీ, సమయాల్లో సంబంధిత మండలాల్లో హాజరై ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని తెలిపారు.

ఈ మేరకు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) బి. సురేఖ ప్రకటన విడుదల చేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});