ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కృష్ణ అల్వార్‌తో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల భేటీ
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పార్టీ సంస్థాగత బలోపేతం, సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చ
మన భారత్, ఆదిలాబాద్: న్యూఢిల్లీలోని జనపథ్‌లో ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో బీహార్ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్ కృష్ణ అల్వార్‌ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను కృష్ణ అల్వార్‌కు వివరించారు.
జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, ప్రజా సమస్యలపై పార్టీ తరఫున స్పందించడం, కార్యకర్తలను మరింత క్రియాశీలకంగా భాగస్వాములను చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు వివరించారు.
ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీ ద్వారా జాతీయ స్థాయి పార్టీ నాయకత్వంతో జిల్లా కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకుల మధ్య జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
