manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 2:07 pm Editor : user5442714

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఆదివాసుల దీపావళి సందడి..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఆదివాసుల దీపావళి సందడి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గిరిజన సంప్రదాయ నృత్యాలతో కళకళలాడిన ఎమ్మెల్యే నివాసం – సంప్రదాయ వేషధారణలో అలరించిన ఆదివాసీ మహిళలు

మన భారత్, నేరడిగొండ: నవంబర్ 3, దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తలమడుగు మండలంలోని సోనాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలు మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకుని ప్రత్యేక సందడి చేశారు.

ఈ సందర్భంగా గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు, వేషధారణలో తమదైన శైలిలో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. డప్పుల మోతలు, గిరిజన పాటల నడుమ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. వారి నృత్యాలు, సంప్రదాయ కళారూపాలు ఎమ్మెల్యే నివాసంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దీపావళి పండుగ నేపథ్యంలో ఆదివాసీ మహిళలు నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమం గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రాధాన్యతను చాటిచెప్పింది. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ కళలు, సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని ఈ వేడుకలు గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధా మనోహర్, గ్రామస్తులు,పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

మీరు రిపోర్టర్ గా పని చేయాలని అనుకుంటున్నారా.. ఆలస్యం ఎందుకు క్రింద ఉన్న రెడ్ ప్లస్ బటన్ పై నొక్కి మీ చుట్టుపక్కల వార్తలు పంపగలరు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});