బెల్సరీ రాంపూర్‌లో ఘనంగా దండారి ఉత్సవాల ప్రారంభం..
సంప్రదాయ వేషధారణలు, ఆటపాటలతో ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా వేడుకలు మన భారత్, భీంపూర్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టేలా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. సంప్రదాయ ఆచారాల నడుమ దండారి వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు గ్రామ సర్పంచ్ సిడాం కేశవ్ వెల్లడించారు. ఆదివాసీ సమాజంలో దండారి ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది....