హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్రకు జనసంద్రం.. తెలంగాణలో అధికారమే లక్ష్యమని అమిత్ షా ప్రకటన!
ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాషాయ దళం కదం తొక్కింది.. కాంగ్రెస్, ఇండీ కూటమిపై కేంద్ర హోంమంత్రి తీవ్ర విమర్శలు మన భారత్, హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన మహా పాదయాత్ర జనసంద్రంగా మారింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఓటర్ల హక్కుల సంరక్షణ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాదిగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. కాషాయ జెండాలు, పార్టీ నినాదాలతో పాదయాత్ర...