అంబేద్కర్ యువజన సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు..
50 ఏళ్లుగా హక్కుల సాధనకు నిరంతర పోరాటం.. అంబేద్కర్ ఆశయాలే లక్ష్యం మన భారత్, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘం నాయకులు, అంబేద్కర్ వాదులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఐదు దశాబ్దాలుగా డాక్టర్ బీఆర్...