ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
మన భారత్, తాంసి: నవంబర్ 2, తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రత్యేక గుర్తింపు...