manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 11:34 am Editor : user5442714

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మన భారత్, తాంసి: నవంబర్ 2, తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం వల్ల వారిలో ఉత్సాహం, సృజనాత్మకత, సామాజిక ఐక్యత పెరుగుతాయని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొని పండుగ సందడిని తీసుకొచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు సంతోష్, రమణారెడ్డి, మల్లేశ్, క్రీడల అధికారి ప్రవీణ్, ఆరోగ్య కళాశాల ఇన్‌చార్జ్ దేవిక, ఏజీఎంసీ శశికుమార్, కార్తిక్, అనుపమ, తానుబాయి, రాజందర్, స్రవంతి, వనితతో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});