ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రైతులు అధైర్యపడొద్దు..
కష్టకాలంలో అండగా ఉంటాం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మన భారత్, తలమడుగు:నవంబర్ 1 ,బోథ్ నియోజకవర్గ పరిధిలోని తలమడుగు, భీంపూర్, బోథ్ మండలాలకు చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆయా రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కేటీఆర్ సూచించారు. రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రైతుల సమస్యల పట్ల పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తుందని, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తలమడుగు సర్పంచ్ వెలుగు రాజన్నతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వివిధ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు , పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
