మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొగుళ్ళపల్లి: నవంబర్ 01, (మన భారత్):
ఆదివారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి , ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మొగుళ్ళపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర పార్టీ కార్యాలయం ప్రారభించి, ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షిచారు.ఈ సందర్బంగా మొగుళ్ళపల్లి మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దేవునూరి నరేష్ ఆధ్వర్యంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు దేవునూరి తిరుపతి, కుమారస్వామి, వెంగళ పవన్, దేవేందర్, వంశీ, చెక్క అభినయ్, చెక్క రాము, గుడిమల్ల గంగాధర్, దండు రాకేష్, దేవునూరి హరీష్, నీరటి రాకేష్, వనం సాగర్, చెక్క రాంచరణ్, సాంబరాజ్ యాదవ్, చాట్ల అజయ్, ఏ హరీష్,పుట్ట వెంకటేష్, దేవునూరి ప్రశాంత్ ములకలపల్లి గ్రామ సర్పంచ్ రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ అధ్యక్షుడు అజయ్ కుమార్,బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సంపత్,సంతు, రమేష్, రాజు కుమార్, రాహుల్ ,తదితరులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
