manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 5:39 pm Editor : user5442714

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య.. ఇద్దరు కుమారులకు తీరని లోటు

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇద్దరు కుమారులకు తీరని లోటు

మన భారత్, బోరజ్: అక్టోబర్ 31, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భోరజ్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండల్వాడ గ్రామానికి చెందిన సతీశకు, తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ముక్కెర సౌమ్య (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సౌమ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించేలోపే ఆమె మృతి చెందడంతో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});