manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 3:26 am Editor : Editor Vishal Kumar

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుల దాడి

అన్నమయ్య జిల్లాలో ఘటన.. ముగ్గురు యువకులపై కేసు నమోదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అన్నమయ్య జిల్లా: బస్సును ఆపలేదన్న కారణంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ముగ్గురు యువకులు దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌ను బైకులపై వెంబడించి మరీ కిందకు దింపి దాడి చేయడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లి వద్ద ఆపాలని కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో ఆగ్రహానికి గురైన యువకులు బైకులపై బస్సును వెంబడించారు. అనంతరం బస్సును అడ్డగించి డ్రైవర్‌ను కిందకు దింపి విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.

ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్, రాము, మధుకుమార్ అనే ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆర్టీసీ సిబ్బందిపై విధి నిర్వహణ సమయంలో దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});