రాజన్న సిరిసిల్ల జిల్లా 31 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవానందం, గ్రామ సర్పంచ్ నిర్మల సురేష్ నాయక్ లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోకి తరలించి ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరను పొందాలని సూచించారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని పలు సూచనలు చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ గా నూతన బాధ్యతలు చేపట్టిన మేడిపల్లి దేవానందంను శాలువతో ఘనంగా సత్కరించిన సర్పంచ్ నిర్మల సురేష్ నాయక్.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ నంది కిషన్, ఉపసర్పంచ్ రాజు నాయక్,పాలక వర్గ సభ్యులు లక్ష్మి రాములు నాయక్,అరుణ, రాజేందర్ నాయక్,బుజ్జి రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చందర్ నాయక్,రాజన్నపేట సర్పంచ్ బాపు రెడ్డి,మాజీ సర్పంచ్ ముక్క శంకర్,ఏపీఎం,ఐకెపి సిఎలు, పద్మ, మహిళ సంఘ సభ్యులు, గ్రామ రైతులు, రాజు,రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
