సిరిసిల్ల నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్వీ నాయకులు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రవి గౌడ్.
యావత్ తెలంగాణ కెసిఆర్ ను కోరుకుంటుంది.
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 31 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం వరకు శనివారం బీఆర్ఎస్వీ నాయకులు పాదయాత్ర చేపట్టారు.సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరస్తా వద్ద జై కేసీఆర్ నినాదాల మధ్య కంచర్ల రవి గౌడ్ పాదయాత్రను ప్రారంభించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటాన్ని చేతబట్టి, గులాబీ కండువాలు ధరించి యువకులు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి కొనసాగుతుందని, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆకాంక్షతోనే రాజన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరినట్లు తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని రాజన్నను ప్రార్థించనున్నట్లు కంచర్ల రవి గౌడ్ తెలిపారు.
ఈ పాదయాత్రలో బీఆర్ఎస్వీ నాయకులు మట్టి శ్రీనివాస్, సదుల శేఖర్, కల్యాడపు వినయ్, గజుల రిష్విత్, బసాని అనీష్ కుమార్, కసర్ల మణిశర్మ, కోయేటి జశ్వంత్, కంకణాల సాయి తేజ, తన్నీరు నవనీత్, కంభోజి హర్షిత్, అన్నడి సాత్విక్, చిలువేరి రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
