కొర్టా–చనాకా ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణ చేపట్టాలి
నాసిరకం నిర్మాణ పనులతో దెబ్బతింటున్న కాలువలు.. ప్రజాధనానికి భారీ నష్టం బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి నష్టపరిహారం వసూలు చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 31, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న కొర్టా–చనాకా ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాలువలు దెబ్బతింటూ కూలిపోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపి, ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన వారిపై...