ఆపదలో ఆపన్నహస్తం.. మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు.
ఫిట్స్‌తో రోడ్డుపై కుప్పకూలిన మహిళకు తక్షణ ప్రథమ చికిత్స. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 31 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర :ప్రజల రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా తమ బాధ్యతేనని ఎల్లారెడ్డిపేట పోలీసులు మరోసారి చాటుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మానవత్వంతో స్పందించి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయిన ఓ మహిళకు సకాలంలో సహాయం అందించారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై శనివారం...