manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:57 am Editor : user5442714

మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న ఇందిరా గాంధీ 42 వర్ధంతి వేడుకలు

మొగుళ్ళపల్లి: అక్టోబర్ 31,(మన భారత్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మాట్లాడారు.ఇందిరా గాంధీ చేసిన త్యాగాలు, చూపిన దైర్యం, ఎప్పటికి స్పూర్తిదాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ ,కాంగ్రెస్ నాయకులు క్యాతరాజు రమేష్, నడిగోటి రాము, ఏలేటి సదాశివరెడ్డి, మంగళపల్లి శ్రీనివాస్, చాట్ల రవీందర్, ఎర్రబెల్లి కోటేశ్వరరావు, బత్తిని భాస్కర్ , తిప్పారపు సురేందర్ , జనార్ధన్ ,వివిధ గ్రామాల సర్పంచులు ,ఉప సర్పంచ్లు ,ముఖ్య కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});