మంత్రి పొన్నం కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, యువ నాయకుడు పొన్నాల వెంకటేష్ రెడ్డి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 30 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, యువ నాయకుడు పొన్నాల వెంకటేష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గొల్లపల్లి నుంచి అకపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం, వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి బీబీజీ రాంజీ నిధులు కేటాయించాలని కోరారు.అలాగే బైపాస్ రోడ్డులోని శివాలయం నుంచి రాజన్నపేట రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎల్లమ్మ గుడి మీదుగా గాలంగుట్ట వరకు బీటీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల అవసరాల దృష్ట్యా గోదాం ముందు డ్రైయింగ్ ప్లాట్ఫారం ఏర్పాటు చేయాలని కోరారు.వీటితో పాటు నాలుగు మహిళా సంఘ భవనాల నిర్మాణం, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు, గ్రామంలోని బీసీ హాస్టల్లో మౌలిక వసతుల కల్పన, భవనానికి రంగులు వేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రికి వివరించారు.గ్రామ అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ఆయా పనులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.గ్రామ అభివృద్ధికి చొరవ చూపి కలెక్టర్‌కు లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, యువ నాయకుడు పొన్నాల వెంకటేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
