తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల అధ్యక్షుడిగా కదిరే భాస్కర్ గౌడ్…
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మహిళా మండల అధ్యక్షురాలుగా కులేరి మౌనిక.
ముస్లిం కమిటీ మండల అధ్యక్షుడిగా హాజీ బాబా
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 30 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లారెడ్డిపేట మండల నూతన కమిటీని ఆ పార్టీ అధినేత కవిత శుక్రవారం ప్రకటించినట్లు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మజీద్ తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియమించబడిన ఈ నూతన కార్యవర్గానికి మండలంలోని వివిధ స్థాయి నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు మజీద్ అన్నారు.పార్టీ అధినేత కవిత ప్రకటన మేరకు ఎల్లారెడ్డిపేట మండల కమిటీ మండల అధ్యక్షులుగా కదిరే భాస్కర్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి కోడిముంజ బాబు,
ఆర్గనైజింగ్ కార్యదర్శి బొమ్మనవేని పరుశరాములు,
మండల కోశాధికారి బైరి రాజేష్,
మండల ప్రెస్ రిలేషన్ అధికారి మారేపు భూశంకర్,మండల స్పోక్ పర్సన్లు మహమ్మద్ మహబూబ్ అలీ, పంజారి ప్రతిభ, భూపతి,మండల జాయింట్ సెక్రటరీలు సయ్యద్ లాల్ మహమ్మద్, బైరి సంధ్య
ఓర్సు అశోక్, బాయికాడి ఆంజనేయులు లను నియమించారు. అలాగే మండల పార్టీ మహిళ అధ్యక్షురాలిగా కుల్లేరి మౌనిక, మండల ప్రధాన కార్యదర్శిగా షేక్ షబానా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రేణు యాదవ్, మండల కోశాధికారిగా లక్ష్మీ, మండల ప్రెస్ రిలేషన్ అధికారిగా కుల్లేరి దీప్తికుమార్, మండల జాయింట్ సెక్రటరీ-1 పుష్పలత, మండల జాయింట్ సెక్రటరీ-2 లాస్య, మండల జాయింట్ సెక్రటరీ-3 మహేశ్వరి, మండల జాయింట్ సెక్రటరీ- 4 రజిత, మండల స్పోక్ పర్సన్ అమూల్య, కమిటీ మెంబర్లుగా కవిత, సంగీత, లావణ్య లను ఎన్నుకున్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండల ముస్లిం మైనారిటీ వింగ్ కమిటీ
మండల అధ్యక్షుడిగా సయ్యద్ హాజీబాబా, మండల ప్రధానకార్యదర్శిగా మొహమ్మద్ షాదుల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా షేక్ పున్ను, మండల ప్రెస్ రిలేషన్స్ అధికారిగా సయ్యద్ షరీఫ్, మండల కోశాధికారిగా షేక్ బషీర్,మండల సంయుక్తకార్యదర్శి-1 మొహమ్మద్ ఇబ్రహీం, మండల సంయుక్తకార్యదర్శి- 2 షేక్ సమీర్, మండల సంయుక్త కార్యదర్శి-3 షేక్ గౌస్, మండల సంయుక్తకార్యదర్శి-4 సయ్యద్ మహ్వీన్, మండల అధికార ప్రతినిధి షేక్ మౌలానా, మండల అధికార ప్రతినిధి షహానా అజ్మీ, మండల కమిటీ సభ్యులు రష్మ అంజుమ్,సమీనా బేగం, మొహమ్మద్ అంకూస్, సయ్యద్ సాబీర్, మొహమ్మద్ తాహెర్, షేక్ జహంగీర్, మొహమ్మద్ మెహబూబ్, అబ్దుల్ రహీమ్, సయ్యద్ షాదాబ్ తదితరులను ఎన్నుకున్నారు..ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పార్టీ అధినేత కవిత తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎల్లారెడ్డిపేట మండలంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన టిఆర్ఎస్ అధినేత కవితక్క కు, అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ మజీద్ కు కృతజ్ఞతలు తెలిపారు.కొత్తగా ఎన్నికైన మండల నాయకులకు పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
