రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన .. మండల రైతులకు న్యాయం చేయాలని నాయకుల డిమాండ్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు: అక్టోబర్ 30, తలమడుగు మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకిడి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు మండలాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని గుర్తించిన అధికారులు తలమడుగు మండలంలో మాత్రం ఎలాంటి ప్రభావం లేదని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల మండలాలను ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినప్పుడు తలమడుగు మండలాన్ని ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు.
తలమడుగు మండలంలో సాగునీటి సదుపాయాలు, చెక్‌డ్యామ్‌లు, ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవడంతో రైతులు పూర్తిగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంగ్రెస్ నాయకుల రాజకీయ జోక్యం కూడా తలమడుగు మండలానికి కరువు గుర్తింపు రాకపోవడానికి కారణమని తోట వెంకటేష్ ఆరోపించారు. రైతుల వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తలమడుగు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, అర్హులైన రైతులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం, అవసరమైన సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
నిరసనలో పాల్గొన్న నాయకులు:
ఈ రాస్తారోకో కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, యువ నాయకుడు అభిరామిరెడ్డి, జిల్లా నాయకులు కేదేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దేవాపూర్ మాజీ సర్పంచ్ అబ్దుల్లా, సర్పంచ్ లక్ష్మారెడ్డి, సుంకిడి గ్రామ సర్పంచ్ ప్రకాష్, చల్లపల్లి సర్పంచ్ అశోక్, కుచులాపూర్ ఉప సర్పంచ్ దీపక్, సర్పంచ్ చంటి, మాజీ సర్పంచ్ నరసింహులు, మహేష్ దేశ్‌ముఖ్, జావిద్ ఖాన్, ఉప సర్పంచ్ అజయ్, తోట శ్రీనివాస్, మహిళా నాయకురాళ్లు పల్లవి, రంబాయి, సునీత రెడ్డి, రాగి కిషన్, తోట ప్రమోద్, సంతోష్, సుదర్శన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రవీణ్ తదితరులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
