పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి
వరంగల్–నల్గొండ–ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌కు మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ విజ్ఞప్తి వరంగల్: త్వరలో జరగనున్న వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు బి. వినోద్ కుమార్ కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటును నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని...