కొడకండ్ల మండల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. అధికారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశం మన భారత్, పాలకుర్తి: కొడకండ్ల మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల అమలులో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం జరగకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు....