మరక చెరువు కాలువకు గండి.. నడిపినపేటలో జలదిగ్బంధంలో ఇళ్లు
భారీ వర్షాలతో గ్రామంలోకి దూసుకొచ్చిన వరద నీరు.. పది ఇళ్లకు నష్టం ఆదుకోవాలని అధికారులకు బాధితుల వేడుకోలు గరివిడి, అక్టోబర్ 28 (మన భారత్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గరివిడి మండలం నడిపినపేట గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామానికి సమీపంలో ఉన్న మెరక చెరువు కాలువ ఒక్కసారిగా తెగిపోవడంతో వరద నీరు గ్రామంలోకి భారీగా చేరింది. దీంతో పలు ఇళ్లలోకి నీరు ప్రవేశించి గ్రామం...