manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:21 pm Editor : user5442714

పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి..

తలమడుగు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి: తెలంగాణ రక్షణ సేన మండల కన్వీనర్ నిమ్మల గజానన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29

ఈ నెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్ పిలుపునిచ్చారు. ఈ సభకు తలమడుగు మండలంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా నిమ్మల గజానన్ మాట్లాడుతూ, ఇంద్రవెల్లిలో జరగనున్న పాంచజన్య సంకల్ప సభకు ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమన్వయంతో తరలివచ్చి సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు సంబంధించిన సమాచారాన్ని గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేసి, ఎక్కువ మంది పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు.

ఈ సభకు తలమడుగు మండలం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల నాయకులు గడుగు పోచన్న, శివాజి, కాంతారావు, మూసుకు గంగారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});