manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:07 pm Editor : user5442714

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి..

డిమాండ్ నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం.. మండల సర్పంచుల హెచ్చరిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 29 ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల సర్పంచుల ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

మండలంలో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచులు వినతిపత్రంలో పేర్కొన్నారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు పంటల నుంచి తగిన ఆదాయం రాక ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి, తలమడుగును కరువు మండలంగా ప్రకటించడంతో పాటు రైతులకు అవసరమైన ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం

తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మండల సర్పంచులు హెచ్చరించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ (ఎంఆర్ఓ) రాజ్‌మోహన్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలనే డిమాండ్‌తో రైతు జేఏసీ సోమవారం తలపెట్టిన తలమడుగు మండల బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని సర్పంచులు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని పేర్కొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});