విషాదం.. ఇంట్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి
మన భారత్, తలమడుగు: అక్టోబర్ 28, ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్లి(కే) గ్రామానికి చెందిన దీపిక బంగారుగూడలోని మహాత్మా జ్యోతిబా ఫూలే కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల నేపథ్యంలో ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం...