manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 6:59 am Editor : user5442714

విషాదం.. ఇంట్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 28, ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్లి(కే) గ్రామానికి చెందిన దీపిక బంగారుగూడలోని మహాత్మా జ్యోతిబా ఫూలే కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల నేపథ్యంలో ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పని విషయంలో తండ్రి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు పేర్కొన్నారు.

విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తలమడుగు ఎస్సై రాధిక వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});