ఢిల్లీ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్
హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిపేందుకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలపై ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్ వంటి కార్యక్రమాలను సమ్మిట్‌తో అనుసంధానిస్తూ తెలంగాణలోని పారిశ్రామిక, సాంకేతిక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించాలని పేర్కొన్నారు.
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయిలో మరింత పెంచే అవకాశముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. నవంబర్ మొదటి వారంలోగా ఏర్పాట్లకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయాలని, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి, ఆతిథ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రముఖులకు తెలియజేసేలా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రచార ఏర్పాట్లతో పాటు డ్రోన్ ఆధారిత ప్రచారాన్ని కూడా చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించేలా ప్రచార ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి భవిష్యత్ ప్రాధాన్య రంగాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు, ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలతో కూడిన ఏవీజీసీ (AVGC) విభాగానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు. అభివృద్ధి చెందుతున్న ఈ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలను ప్రదర్శించేలా కార్యక్రమాలను రూపొందించాలని చర్చించారు.
సమ్మిట్ వేదిక రూపకల్పనలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే డిజైన్లను వినియోగించాలని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రత్యేకతను విదేశీ అతిథులకు పరిచయం చేసేలా అలంకరణలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుతో పాటు తెలంగాణను అంతర్జాతీయ పారిశ్రామిక వేదికపై మరింత బలంగా నిలబెట్టే దిశగా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
జిల్లా స్టాఫ్గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపు
ఢిల్లీ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్
హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి:
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిపేందుకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలపై ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్ వంటి కార్యక్రమాలను సమ్మిట్‌తో అనుసంధానిస్తూ తెలంగాణలోని పారిశ్రామిక, సాంకేతిక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించాలని పేర్కొన్నారు.
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయిలో మరింత పెంచే అవకాశముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. నవంబర్ మొదటి వారంలోగా ఏర్పాట్లకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయాలని, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి, ఆతిథ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు
టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రముఖులకు తెలియజేసేలా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రచార ఏర్పాట్లతో పాటు డ్రోన్ ఆధారిత ప్రచారాన్ని కూడా చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించేలా ప్రచార ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి భవిష్యత్ ప్రాధాన్య రంగాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు, ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలతో కూడిన ఏవీజీసీ (AVGC) విభాగానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు. అభివృద్ధి చెందుతున్న ఈ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలను ప్రదర్శించేలా కార్యక్రమాలను రూపొందించాలని చర్చించారు.
సమ్మిట్ వేదిక రూపకల్పనలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే డిజైన్లను వినియోగించాలని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రత్యేకతను విదేశీ అతిథులకు పరిచయం చేసేలా అలంకరణలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించార