ప్రజలకు మెరుగైన సేవలే ఏఐ విజయానికి కొలమానం
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వేగం పెంచాలి.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి ‘ఏఐ సాక్షమ్’ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి: ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల జాప్యాన్ని తగ్గించి, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో కనిపించే...