manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 1:24 pm Editor : user5442714

నవంబర్ 1న రైతు గర్జన సభ.. విజయవంతం చేయాలి

నవంబర్ 1న రైతు గర్జన సభ.. విజయవంతం చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

డైట్ కాలేజీ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సభ

రైతులకు భరోసా కల్పించేందుకే కేటీఆర్ హాజరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో రైతుల సమస్యలు, రైతు ఆత్మహత్యల నేపథ్యంలో నవంబర్ 1న ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న ‘రైతు గర్జన’ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.

ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, రైతుల సమస్యలను చర్చించడమే సభ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతు గర్జన సభకు సంబంధించి ‘హలో రైతు.. చలో ఆదిలాబాద్’ పోస్టర్‌ను మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ విప్ బాల్క సుమన్‌లతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. అనంతరం సభ నిర్వహించనున్న డైట్ కాలేజీ మైదానాన్ని వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

రాష్ట్రంలో రైతుల సమస్యలపై గతంలో చేపట్టిన ఉద్యమాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వాలు రైతుల సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించి, వారి పరిస్థితులను తెలుసుకోనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సమస్యలను సభ వేదికగా ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.

నవంబర్ 1న నిర్వహించే రైతు గర్జన సభకు జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});