manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 12:56 pm Editor : user5442714

ఆ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతి..

ఆ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన ఉయికే స్వామి (30) హైదరాబాద్‌లో సినిమాల్లో ఆర్టిస్టుగా పనిచేస్తున్నట్లు సమాచారం.

స్వామి తన స్నేహితులతో కలిసి ఓ గదిలో పార్టీ చేసుకున్న సమయంలో వారి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం గదిలో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గదిని పరిశీలించగా స్వామి మృతదేహం గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వామి మృతికి దారితీసిన పరిస్థితులు, గదిలో జరిగినట్లు చెబుతున్న గొడవకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});