మన భారత్, సోనాల: అక్టోబర్ 26:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఘన్పూర్‌లో టీఆర్‌ఎస్‌కు బలం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి పలువురి చేరికలు
సోనాల మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)లో చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది ప్రజలు పార్టీలో చేరేలా నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఘన్పూర్‌లో జరిగిన ఈ చేరికలతో గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపునిచ్చేలా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దేవురావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
