manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 1:24 am Editor : user5442714

పందుల బెడద.. ప్రజావాణిలో ఫిర్యాదు

పందుల బెడదతో పంట నష్టం – తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్ : చిట్యాల మండలంలోని హెచ్‌పి గ్యాస్ గోదాం ఎదురుగా నివసిస్తున్న శీలపాక నరసయ్య అను రైతులు. నా ఆయిల్ పామ్ మరియు కూరగాయల తోటలో గత కొంతకాలంగా పందుల బెడద తీవ్రంగా పెరిగింది. సుమారు 50–60 పందులు గుంపులుగా వచ్చి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీనివల్ల నాకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోంది.అదేవిధంగా, ఈ పందులు గ్రామంలోని ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పందుల యజమానులను పలుమార్లు సంప్రదించినప్పటికీ, నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాగే బాధ్యత తీసుకోవడం లేదు..

తెలంగాణ పంచాయతీరాజ్ 2018 సెక్షన్ 86… చట్టం ప్రకారము ప్రజా ఆరోగ్యం మరియు పంటనష్టం భద్రతను పరిరక్షించేందుకు పందులు వీధి కుక్కలను నియంత్రించి తొలగించే చట్టపరమైన అధికారం బాధ్యత కల్పించడం జరిగింది.

పశువుల అతిక్రమణ చట్టం…1871
ఈ చట్టం కేంద్ర చట్టం ప్రకారం పంటలను నాశనం చేయగా లేదా ప్రజా రహదారులను పాడు చేయడం అల్లరి చేస్తున్న పందులను అధికారులు చట్టబద్ధంగా స్వాధీనం చేసుకొని నిర్బంధించవచ్చు అలాగే పందుల యజమానులకు జరిమానాలు విధించవచ్చు.

దయచేసి వెంటనే సంబంధిత అధికారులు పందులను నియంత్రించేందుకు తగినచర్యలు తీసుకొని అలాగే మా పంటలను మరియు గ్రామ ప్రజలను రక్షించవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను.