manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 11:50 am Editor : user5442714

ఎల్లమ్మ తల్లి ఆలయ షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు.

బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన గౌడ సంఘ సభ్యులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్ బోనాల మణెమ్మ.

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 26 మన భారత్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న షెడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ బోనాల మణెమ్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులకు, ప్రత్యేక పూజలు నిర్వహించే సందర్భాల్లో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా షెడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు, గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు గౌడ సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్ర రెడ్డి ,మద్దుల బుగ్గారెడ్డి, బోనాల సాయికుమార్, నరేష్, పరశురాం, గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, రంగయ్య, మల్లేశం, ఎల్లాగౌడ్, జవ్వాజి రాజు, పెద్ద మల్లేశం తదితర గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.