బండల నాగాపూర్లో ఘనంగా పోచమ్మ పండుగ వేడుకలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్
మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ పండుగ వేడుకల్లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయన పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పండుగ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆడే గజేందర్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయంగా నిర్వహించే పోచమ్మ పండుగలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను ప్రతిబింబిస్తాయని నాయకులు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడల సంతోష్, కప్పర్ల ఉపసర్పంచ్ నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్న యాదవ్, సంజీవ్, సీనియర్ నాయకులు ససానే మాధవ్, బుక రాములు, ఎండి సద్దాం, సతీష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ప్రభాకర్, బాపురెడ్డి, ఆత్మ డైరెక్టర్ కేమ హనుమండ్లు, మాజీ ఉపసర్పంచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
