కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ..
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 25: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నెలవారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మోతీ రామ్, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు....