చిన్న బతుకమ్మ.. పెద్ద సందేశం
నీటిని పొదుపుగా వాడుదాం.. కరువును జయిద్దాం అంటూ సందేశం మన భారత్, తలమడుగు: అక్టోబర్ 24: తలమడుగు మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారి వేదస్వి రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలియజేసేలా చిన్నారి వేదస్వి తన బతుకమ్మను ప్రత్యేకంగా...