ఎల్‌నినో ముప్పు నుంచి రైతులను, ప్రజలను కాపాడాలి!
నాలుగు సూత్రాల విపత్తు నివారణ వ్యూహాన్ని అమలు చేయాలి. ప్రభుత్వానికి సీనియర్ రాజకీయవేత్త కొండూరు గాంధీరావు సూచన. ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 24 మన భారత్ ప్రతినిధి :తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు విపత్తు నివారణ ప్రణాళికను రూపొందించి, పటిష్టంగా అమలు చేయాలని సీనియర్ రాజకీయవేత్త కొండూరు గాంధీరావు ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పంటలను కాపాడటంతో పాటు ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా చూడాలని, పశుసంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు...