ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో చక్రిని స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24 :-
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చక్రిని స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన వైద్య సేవలు స్థానికంగా అందుబాటులోకి రావడం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్లినిక్ ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. అనంతరం క్లినిక్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ కూడా క్లినిక్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా క్లినిక్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ ఏఎంసీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ అంబకంటి సుష్మా అశోక్, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, రెండ్ల రాజన్నతో పాటు పలువురు నాయకులు, క్లినిక్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
